1.మామిడి పండు తిన్న వెంటనే పెరుగు తీసుకోకూడదు
మామిడి పండు తిన్న వెంటనే పెరుగు తీసుకోవడానికి ఆరోగ్యానికి మంచిది కాదు. మామిడి పండ్లు, పెరుగు ఒకేసారి తిన్నా, లేక వెంట వెంటనే తీసుకున్నా కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల వెంటనే అనారోగ్యానికి గురవుతారు.2. కారం అధికంగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు
మామిడి పండు తిన్న వెంటనే కారం అధికంగా ఉండే పదార్థాలు, ఎండు మిరపకాయలు తీసుకుంటే ఉదర సమస్యలు (stomach upset), చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి.
3. కాకరకాయతో చేసిన పదార్థాలు తినకూడదు
మామిడి పండు తింటూ కాకరకాయతో చేసిన పదార్థాలు తినకూడదు. వాంతులు కావడం, శ్వాస సంబంధిత సమస్యలు, nausea లాంటి అనారోగ్య సమస్యల బారిన పడతాం.
4. తిన్న వెంటనే మంచినీళ్లు తాగకూడదు
మామిడి పండు తిన్న వెంటనే మంచినీళ్లు తాగితే కడుపు నొప్పి (stomach ache), కడుపులో మంట, శరీరంలో గ్యాస్ మరియు కొన్ని రకాల రసాయనాలు ఉత్పన్నమవుతాయి. దీర్ఘకాలం ఇలాగే కొనసాగిస్తే ప్రేగులకు సంబంధించి అనారోగ్య సమస్యల బారిన పడతారు. మామిడి పండు తిన్నాక కనీసం అరగంట తరువాత మంచినీళ్లు తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
5. కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు
మామిడి పండ్లు తిన్న వెంటనే శీతల పానియాలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసిందే. మామిడి పండులో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. కూల్ డ్రింక్స్ తాగినా మీ శరీరంలోకి అధిక చక్కెర నిల్వ అవుతుంది. తరచుగా ఇలాంటివి జరిగితే మధుమేహం (Diabetes) బారిన పడే అవకాశాలు ఉంటాయి
@zeenews
Tags:
Health Tips