Personal Loan: మీ అకౌంట్‌లోకి రూ.8 లక్షలు.. గూగుల్ పే అదిరిపోయే శుభవార్త, ఫోన్ నుంచే అప్లయ్ చేసుకోవచ్చు

GPay | మీరు గూగుల్ పే వాడుతున్నారా? అయితే తీపికబురు. ఈజీగానే రూ. 8 లక్షలు పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

1. Loan | డబ్బులతో అవసరం పడిందా? బంధువుల నుంచి సాయం అందలేదా? అప్పు కోసం చూస్తే.. చేతికి డబ్బులు లభించలేదా? ఏం చేయాలో అర్థం కావడ లేదా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇంట్లో నుంచి ఎక్కడికీ వెళ్లకుండానే ఈజీగా లోన్ పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఈ డీల్ తెలుసుకోవాల్సిందే.

2. దిగ్గజ యూపీఐ సర్వీసెస్ యాప్ గూగుల్ పే తన కస్టమర్లకు అదిరే శుభవార్త తీసుకువచ్చింది. ఈజీగా పర్సనల్ లోన్ పొందే వెసులుబాటు అందుబాటులో ఉంచింది. అందువల్ల మీరు గూగుల్ పే ద్వారా ఈజీగా లోన్ పొందొచ్చు.

3. అయితే ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి. గూగుల్ పే నేరుగా ఎలాంటి రుణాలు అందించదు. ఇది ఇతర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. లెండింగ్ ప్లాట్‌ఫామ్స్‌ను తన యాప్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉంచుతుంది.

4. అంటే మీరు గూగుల్ పే ద్వారా ఇతర లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ నుంచి రుణాలు పొందొచ్చు. మీరు గూగుల్ పే ద్వారా ఏకంగా రూ. 8 లక్షల వరకు డబ్బులు పొందొచ్చు. మీరు రుణ అర్హత ప్రాతిపదికన మీకు లోన్ వస్తుందా? రాదా? అనే అంశం నిర్ణయం అవుతుంది.


5. క్రెడిట్ స్కోర్, రీపేమెంట్ కెపాసిటీ వంటి పలు అంశాల ప్రాతిపదికన రుణ అర్హత నిర్ణయం అవుతుంది. మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే.. ఈజీగా బ్యాంక్ అకౌంట్‌లోకి లోన్ డబ్బులు వచ్చేస్తాయి. లేదంటే లేదు. రూ. 8 లక్షల వరకు ఎంత మొత్తం అయినా లోన్ రూపంలో పొందొచ్చు.

6. గూగుల్ పే ద్వారా లోన్ పొందాలని భావించే వారు ముందుగా గూగుల్ పే యాప్‌లోకి వెళ్లాలి. అక్కడ లోన్స్ ఆప్షన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు డీఎంఐ ఫైనాన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి.

7. డీఎంఐ ఫైనాన్స్ కస్టమర్లకు రూ. 10 వేల నుంచి రూ. 8 లక్షల వరకు రుణాలు అందిస్తోంది. నెలవారీ రీపేమెంట్ రూ. 500 నుంచి ప్రారంభం అవుతుంది. తీసుకున్న రుణానికి 6 నెలల నుంచి ఈఎంఐ టెన్యూర్ పెట్టుకోవచ్చు.

8. రుణాలపై వడ్డీ రేటు అనేది 15 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. లోన్ పొందాలని భావించే వారు అక్కడి నుంచే లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. 2 నిమిషాల్లోనే లోన్ ఎలిజిబిలిటీ తెలిసిపోతుంది. లోన్ అర్హత ఉంటే.. అప్లై చేసుకోవచ్చు. లేదంటే లేదు.

9. పాన్ కార్డు, ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. పాన్ కార్డు వివరాలు ఎంటర్ చేయగానే మీకు లోన్ వస్తుందా? రాదా? అని తెలిసిపోతుంది. లోన్ అర్హత ఉంటే.. అక్కడి నుంచే అప్లై చేసుకోవచ్చు.
dskblog

Post a Comment

Previous Post Next Post