Business Ideas: చదువు లేకపోయినా పర్లేదు.. ఉన్న ఊరిలోనే ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ. 1 లక్ష పక్కా..

గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారా? ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? అయితే మేము మీకో అద్బుతమైన ఐడియా చెబుతాం. వ్యవసాయాన్ని చేసుకుంటూ ఈ వ్యాపారం చేస్తే మీకు రెట్టింపు ఆదాయం రావడం పక్కా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సంప్రదాయ వ్యవసాయ ఉత్పత్తులతోపాటు, ఆరోగ్యకరమైన పంటల ఉత్పత్తులకు డిమాండ్ విపరీతంగా పెరిగిది. కాబట్టి మీరు వ్యవసాయం చేస్తు లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అలాంటి వ్యాపారంలో చేపల పెంపకం కూడా ఒకటి. చేపల పెంపకంలో ఏడాదికి 25వేల పెట్టుబడి పెట్టినట్లయితే మీకు నెలకు లక్షల రూపాయల ఆదాయం తప్పనిసరి.

తెలంగాణతోపాటు అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వం చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తుంది. చేపల పెంపకానికి సంబంధించి రుణాలు కూడా అందిస్తుంది. కేంద్రంలోని మోదీ సర్కార్ ముద్ర రుణం ద్వారా ఇలాంటి వ్యాపారం ప్రారంభించేవారికి చేయూతనిస్తుంది.

ఇవాళ మనం మంగుర్ చేపల పెంపకం గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో చైనా, జపాన్ తర్వాత భారత్ మూడవ స్థానంలో ఉంది. చేపల పెంపకం (మచ్చలి పాలన్) రైతులకు చాలా లాభదాయకమైన వ్యాపారంగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ చేపల పెంపకం ద్వారా మంచి లాభాలు పొందవచ్చన్నది రైతుల ప్రశ్నగా మిగిలిపోయింది. దీనికి మంగుర్ చేపల పెంపకం మంచి ఎంపిక. ఇది మంచినీటి చేప. దీనిని క్యాట్ ఫిష్ అని కూడా అంటారు.

మంగూర్ చేప తక్కువ నీటిలో చాలా రోజులు సులభంగా జీవించగలదు. ఈ చేప మీరు మార్కెట్‌లో సజీవంగా, ఎల్లప్పుడూ తాజాగా చూస్తారు. మార్కెట్‌లో మంగూర్ చేపలకు ఎప్పుడూ డిమాండ్ ఉండడానికి ఇదే కారణం.

 మంగుర్ చేప లక్షణాలు:

– ఇది తక్కువ లోతులో, తక్కువ ఆక్సిజన్‌లో కూడా పెంచవచ్చు.

– ఇందులో ప్రోటీన్ , ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.

-ఈ చేపల్లో కొవ్వు శాతం కూడా తక్కువగా ఉంటుంది.

– మంగుర్ చేపల రవాణా చాలా సులభం.

మంగూర్ చేపల పెంపకం ప్రయోజనాలు:

-ఈ చేప నిస్సార, చిత్తడి, తక్కువ నీరు, ప్రతికూల వాతావరణంలో కూడా పెరుగుతుంది.

-నీటిలో ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

-ఇతర చేపలతో పోలిస్తే వీటి నిర్వహణ, పెంపకానికి అయ్యే ఖర్చు కూడా తక్కువే.

-మార్కెట్‌లో వీటికి డిమాండ్ కూడా బాగానే ఉంది.

మంగూర్ చేపల కోసం చెరువు నిర్మాణం:

-దీనికి ఒక ఎకరం చెరువు సరిపోతుంది.

– చెరువు కోసం 7 నుండి 8 pH విలువ కలిగిన మట్టిని ఎంచుకోండి.

-చెరువులో మాత్రమే మంచినీటి ఏర్పాట్లు చేయండి.

ఫిషింగ్ ఎర:

-ఈ చేప శాఖాహారం, మాంసాహారం రెండూ.

– దీనికి ఆహారంగా ఎండు చేపలు, చేపల పొడి, ఆవాల పిండి, బియ్యం పొడి మొదలైనవి ఇవ్వాలి.

-దీని ఆహారంలో 30 నుంచి 35 శాతం ప్రొటీన్లు కూడా ఉండాలి.

ఉత్పత్తి, ఖర్చు:

మంగుర్ చేప 5 నుండి 6 నెలల్లో 100 నుండి 120 గ్రాములు అవుతుంది. ఒక హెక్టారు చెరువులో 3 నుండి 4 టన్నుల చేపలు ఉత్పత్తి అవుతాయి. దీని ధర మార్కెట్‌లో కిలో 200 నుంచి 300 వరకు లభిస్తోంది. మంగూర్ చేపల పెంపకానికి హెక్టారుకు రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీనితో మీరు సులభంగా 3-5 లక్షల రూపాయలు సంపాదించవచ్చు.

క్లుప్తంగా చెప్పాలంటే, మంగూర్ చేపలను తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో మంచి లాభాలను ఇస్తుంది. చిన్న, సన్నకారు రైతులు కూడా చిన్న చెరువులో చేపల పెంపకం చేయడం ద్వారా సులభంగా మంచి లాభాలు ఆర్జించవచ్చు. దీని కోసం ప్రభుత్వం మత్స్య సంపద యోజన కింద గ్రాంట్లు కూడా ఇస్తుంది.


dskblog

Post a Comment

Previous Post Next Post