మీ స్మార్ట్‌ ఫోన్‌ పోయిందా..? ఐతే క్షణాల్లో ఇలా కనిపెట్టేయండి..

లక్షలు పోసి ముచ్చపటపడి కొనుక్కొన్న ఫోన్ ఎవడో దొంగ కొట్టేస్తాడు. దీంతో ఫోన్ లో బ్యాంక్ వివరాలు, ఫొటోలు, వీడియోలు వంటి వ్యక్తిగత గత సమాచారం ఇతరుల చేతికి సులువుగా చేరిపోతుంది. దీనికి చెక్ పెట్టేందుకు.


వేలకు వేలు దారపోసి కొన్న స్మార్ట్‌ఫోన్‌ను ఎవరైనా దొంగిలించారంటే ఆ బాధ వర్ణణాతీతం. ఫోన్‌లో విలువైన సమాచారం అగంతకుల చేతికి చేరి దుర్వినియోగం అవుతుంది. దీనికి చెక్‌ పెట్టేందుకు కేంద్ర టెలికాం విభాగం సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (CEIR)ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో దేశంలో ఎవరైనా మొబైల్‌ పోగొట్టుకున్నా లేక చోరీకి గురైనా క్షణాల్లో కనిపెట్టేయొచ్చన్నమాట. మార్చి 15 నుంచి అన్ని రాష్ట్రాల్లో సీఈఐఆర్‌ డేటాబేస్ సేవలు మొబైల్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. తొలుత దీని సేవలను ప్రయోగాత్మకంగా దాద్రా నగర్ హవేలీ, గోవా, మహారాష్ట్రలలో సెప్టెంబర్ 2019 నుంచి ప్రారంభించారు. ఆ తర్వాత 2019 డిసెంబర్ నుంచి ఢిల్లీలో కూడా దీని సేవలను ప్రారంభించింది. కోవిడ్-19 మహమ్మారి కారణం మిగతా రాష్ట్రాల్లో దీనిని విస్తరించడానికి కొంత జాప్యం జరిగింది.

సీఈఐఆర్‌ను ఎలా ఉపయోగించాలంటే..

• సీఈఐఆర్‌ వెబ్‌సైట్‌ లైదా మొబైల్‌ యాప్‌ రూపంలో అందుబాటులో ఉంది. ముందుగా యూజర్‌ సీఈఐఆర్‌ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ ఫోన్‌లో ప్లే స్టోర్‌ నుంచి నో యువర్‌ మొబైల్‌ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌ ఓపెన్‌ చేసిన ఐఎమ్‌ఈఐ నంబర్‌ను నమోదు చేసుకోవాలి.
• ఫోన్‌ పోగొట్టుకున్న తర్వాత యూజర్‌ సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. FIR కాపీ తీసుకుని సీఈఐఆర్‌ పోర్టల్‌ ఓపెన్ చేసి అందులో బ్లాక్‌ స్టోలెన్‌/లాస్ట్‌ మొబైల్‌, అన్‌-బ్లాక్‌ ఫౌండ్‌ మొబైల్‌, చెక్‌ రిక్వెస్ట్ స్టేటస్‌ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిల్లో బ్లాక్‌ స్టోలెన్‌/లాస్ట్‌ మొబైల్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ ఫోన్‌ నంబర్‌, IMEI నంబర్, ఫోన్‌ బ్రాండ్‌ పేరు, మోడల్‌ వంటి వివరాలతోపాటు మొబైల్‌ కొనుగోలు చేసిన రిసిప్ట్‌ అప్‌లోడ్‌ చేయాలి. లాస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్షన్‌లో ఫోన్ పోగొట్టుకున్న ప్రాంతం, తేదీ, FIR నంబర్‌ వివరాలు నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్‌ కాపీని కూడా అప్‌లోడ్‌ చేయాలి.
• ఆ తర్వాత మొబైల్‌ యూజర్‌కు సంబంధించిన పేరు, అడ్రస్, ఐడీ కార్డు, ఈ మెయిల్‌ వంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ నమోదు చేసి సబ్‌మిట్‌ చేయాలి.
• యూజర్ వివరాలను మొబైల్‌ నెట్‌వర్క్‌ ఆపరేటర్లకు పంపిస్తుంది. వాటిని పరిశీలించి IMEI నంబర్ ద్వారా సీఈఐఆర్‌ ఫోన్‌ను 24 గంటల వ్యవధిలో బ్లాక్ చేస్తుంది. అప్పుడు దొంగిలించిన వాళ్లు ఫోన్‌ సిమ్‌ కార్డు మార్చినా ఫోన్‌ పనిచేయదు. పైగా కొత్తగా వేసిన సిమ్‌ కార్డు వేస్తే, సీఈఐఆర్‌కు సిమ్‌కార్డు అలర్ట్‌ మెసేజ్‌ వస్తుంది. దీని ఆధారంగా ఫోన్‌ లొకేషన్‌ను ట్రాక్‌ చేయవచ్చు.

ఒకవేళ పోగొట్టుకున్న ఫోన్‌ దొరికితే యాప్ లో అన్‌బ్లాక్ చేయాల్సి ఉంటుంది. అందుకు సీఈఐఆర్‌ పోర్టల్‌లో అన్‌బ్లాక్‌ ఆప్షన్ పై క్లిక్‌ చేసి, యూజర్ ఐడీ ఇతర వివరాలను సమర్పిస్తే ఫోన్‌ అన్‌బ్లాక్‌ అవుతుంది.


dskblog

Post a Comment

Previous Post Next Post