What Next ?
10 వ తరగతి తర్వాత ఏమిటి?
కరోనా కారణంగా గతేడాది పదోతరగతి పరీక్షలు లేకుండానే
విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. ఈ ఏడాది కూడా పరీక్షలు వాయిదా
పడుతున్నాయి. వాస్తవానికి విద్యార్థి జీవితంలో పదో తరగతి అనేది ఎంతో కీలకమైన దశ.
అందుకే టెన్త్‌ను ‘టర్నింగ్ పాయింట్’ అంటారు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా.. విద్యార్థికి
మ్యాథమెటిక్స్‌పై ఆసక్తి ఉందా.. సైన్స్‌లో మంచి మార్కులు వచ్చాయా.. అతని స్కిల్
సెట్ ఏంటి అనే దానిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒక
అంచనాకు వస్తారు. అందుకు అనుగుణంగా ఏ కోర్సులో చేరాలో, ఏ
కెరీర్ ఎంచుకోవాలో సలహా ఇస్తుంటారు. పదో తరగతి తర్వాత ఎంచుకునే కోర్సు/ ఇంటర్మీడియట్‌లో చేరే గ్రూప్.. భవిష్యత్
గమ్యాన్ని నిర్దేశిస్తుంది. ఈ నేపథ్యంలో.. పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న వివిధ
కోర్సులు, కెరీర్ మార్గాలపై ప్రత్యేక కథనం..
ప్రతి విద్యార్థి భవిష్యత్‌లో గొప్ప స్థాయికి చేరుకోవాలని; ఉన్నత
స్థానానికి ఎదగాలని కోరుకుంటారు. కొందరు డాక్టర్, మరికొందరు
ఇంజనీర్, ఇంకొందరు లాయర్.. కలెక్టర్, పోలీస్ ఆఫీసర్, టీచర్.. ఇలా ఎన్నో కలలు
కంటారు. ఈ కలలు సాకారం అవ్వాలంటే.. లక్ష్య సాధనకు సరైన సమయంలో సరైన మార్గాన్ని
ఎంచుకోవడం ముఖ్యం! ఆ టర్నింగ్ పాయింటే.. పదో తరగతి!! పదో తరగతి తర్వాత
విద్యార్థుల ముందు ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ కోర్సులు,
ఇంటిగ్రేటెడ్ బీటెక్, ఐటీఐ కోర్సులు
కనిపిస్తాయి. వీటిలో ఒక కోర్సు ఎక్కువ.. మరో కోర్సు తక్కువ కాదు. అన్నింటికీ
చక్కటి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అయితే,
విద్యార్థి తన భవిష్యత్ లక్ష్యం ఏమిటి.. ఏం
సాధించాలనుకుంటున్నారో ఆలోచించుకొని.. దాన్ని బట్టి కోర్సును ఎంపిక చేసుకోవడం
ఉత్తమం.
Type of Courses :
S.No. |
Courses |
Details |
1 |
Intermediate |
Intermediate Courses offered by Telangana State Board of Intermediate Education – Two Year Program |
2 |
IIIT |
|
3 |
Polytechnic |
|
4 |
Special
courses |
Special Courses Offered in State wide Institutions in Polytechnics, Telangana- Three Year Program |
5 |
Short
term courses |
Short term Courses offered by State Board of Technical Education and Training, Telangana |
6 |
Vocational Courses |
|
7 |
STVCC |
|
8 |
Technical Certificate Examinations |
|
9 |
I.T.I |
|
10 |
TOSS |
ఇంటెర్మీడియట్ గ్రూపులు
► పదో తరగతి తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు
ఎంచుకునే మార్గం.. ఇంటర్మీడియట్. వారివారి ఆసక్తులకు అనుగుణంగా గ్రూపులను
ఎంచుకుంటారు. ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ/ఎంఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులున్నాయి.
► ఎంపీసీ: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ
సబ్జెక్టులు ఉండే ఈ గ్రూప్‌లో ఎక్కువగా ఇంజనీరింగ్ లక్ష్యంగా పెట్టుకున్న
విద్యార్థులు చేరుతుంటారు. వీరు జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్,
ఎంసెట్, బిట్‌శాట్ వంటి ఎంట్రన్స్‌లు రాసి
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, బిట్స్ వంటి
ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్స్‌లో బీటెక్/బీఈలో ప్రవేశం పొందొచ్చు. ఇక ఏపీ/టీఎస్
ఎంసెట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్/బీఈ
కోర్సుల్లో చేరవచ్చు.
► బైపీసీ: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ
సబ్జెక్టులు ఉండే.. ఈ గ్రూప్ చదివినవారు ‘నీట్’ ఎంట్రన్స్‌తో ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్
కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయిలో ఎంసెట్(మెడికల్ అండ్
అగ్రికల్చర్)లో ర్యాంక్ ఆధారంగా అగ్రికల్చర్, వెటర్నరీ
సైన్స్,ఫార్మసీ, ఫిజియోథెరఫీ వంటి
కోర్సుల్లో చేరవచ్చు.
► సీఈసీ/ఎంఈసీ: కామర్స్ అంటే ఇష్టపడేవారు; చార్టర్డ్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ, సీఎంఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదవాలనుకునే వారు ఈ గ్రూపులు
ఎంచుకుంటారు. ఇందులో కామర్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులను అధ్యయనం
చేస్తారు.
► హెచ్‌ఈసీ: టీచింగ్ రంగంలో ప్రవేశించాలనుకునేవారు, ఎల్‌ఎల్‌బీ
వంటి కోర్సులు చేయాలనుకునేవారు, సివిల్స్, గ్రూప్స్ పరీక్షలు రాయాలనుకునే వారు ఇంటర్మీడియట్‌లో హెచ్‌ఈసీ గ్రూప్
ఎంచుకుంటారు. ఇంటర్‌లో ఈ నాలుగు గ్రూపులతోపాటు రెండేళ్లు, ఏడాదిన్నర
కాలవ్యవధి గల పలు ఒకేషనల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఒకేషన ల్ కోర్సులు
పదో తరగతి తర్వాత సంప్రదాయ ఇంటర్మీడియట్ కోర్సులే కాకుండా.. సత్వర
ఉపాధికి అవకాశం కల్పించే ఒకేషనల్ కోర్సుల్లో కూడా చేరొచ్చు.
►
అగ్రికల్చర్ విభాగం: క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్,
డెయిరీయింగ్, ఫిషరీస్, సెరికల్చర్
కోర్సులు.
► బిజినెస్ అండ్ కామర్స్ విభాగం: అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, మార్కెటింగ్ అండ్ సేల్స్‌మెన్‌షిప్, ఆఫీస్
అసిస్టెంట్‌షిప్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్,
ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్.
► ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగం: ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్,
కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్
అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్,
ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్
అప్లయెన్సెస్, రూరల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్, డీటీపీ
అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ.
► హోమ్‌సైన్స్ విభాగం: కమర్షియల్ గార్మెంట్ డిజైనింగ్ అండ్ మేకింగ్,
ఫ్యాషన్ గార్మెంట్ మేకింగ్, హోటల్
ఆపరేషన్స్, ప్రి స్కూల్ టీచర్ ట్రైనింగ్.
► వీటితోపాటు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, మల్టిపర్పస్
హెల్త్ వర్కర్, ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
► రెండేళ్ల ఒకేషనల్ కోర్సులు ఉత్తీర్ణులైన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ
విధానం ద్వారా సంబంధిత పాలిటెక్నికల్ కోర్సు రెండో ఏడాదిలో ప్రవేశించే అవకాశం
ఉంది.
ఉపాధికి
భరోసా–ఐటీఐ
► ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్(ఐటీఐ)..
ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లో కోర్సులు
అందిస్తున్నాయి. విద్యార్థి ఆసక్తిని బట్టి అందుబాటులో ఉన్న కోర్సును ఎంపిక
చేసుకోవచ్చు.
ముఖ్యంగా» టూల్ అండ్ డై మేకర్ ఇంజనీరింగ్ » డ్రాట్స్‌మన్(మెకానికల్) ఇంజనీరింగ్ » డీజిల్ మెకానిక్ ఇంజనీరింగ్ » డ్రాట్స్‌మన్ (సివిల్) ఇంజనీరింగ్ » పంప్ ఆపరేటర్ » ఫిట్టర్ ఇంజనీరింగ్ » మోటార్ డ్రైవింగ్ కమ్ మెకానిక్ ఇంజనీరింగ్ » టర్నర్ ఇంజనీరింగ్ » మ్యానుఫ్యాక్చరర్ ఫుట్‌వేర్ ఇంజనీరింగ్ » రిఫ్రిజిరేటర్ ఇంజనీరింగ్ » మెషినిస్ట్ ఇంజనీరింగ్ » హెయిర్ అండ్ స్కిన్ కేర్ » ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్ » సర్వేయర్ ఇంజనీరింగ్ » షీట్ మెటల్ వర్కర్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు
అందుబాటులో ఉన్నాయి. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశం పొందొచ్చు.
పాలిటెక్నిక్
కోర్సులు
► పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న మరో చక్కటి
కోర్సు.. పాలిటెక్నికల్. ఈ డిప్లొమా కోర్సులకు విద్యార్థుల్లో మంచి ఆదరణ ఉంది.
తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో మెరుగైన ఉపాధి పొందేందుకు ఈ
కోర్సులు దోహదం చేస్తాయి. మూడేళ్లు, మూడున్నరేళ్ల
పాలిటెక్నిక్ కోర్సులు పూర్తికాగానే కంపెనీల్లో సూపర్‌వైజర్ స్థాయి కొలువులు
దక్కించుకోవచ్చు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ఆసక్తి ఉంటే.. ఈసెట్ ద్వారా
బీటెక్/బీఈ కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో చేరవచ్చు.
► పాలిసెట్‌తో ప్రవేశాలు: తెలుగు రాష్ట్రాల్లో టీఎస్ పాలిసెట్/ఏపీ
పాలిసెట్ ఎంట్రన్స్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం
కల్పిస్తున్నారు. పదో తరగతి అర్హతతో పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ
ఎంట్రన్స్‌లో సాధించిన ర్యాంక్ ఆధారంగా ప్రభుత్వ,
ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశం లభిస్తుంది.
► పాలిటెక్నిక్ కోర్సులివే: సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్
ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్
ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్
సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, డెయిరీ
ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, టెక్స్‌టైల్
కెమిస్ట్రీ, గ్లాస్ అండ్ సిరామిక్ ఇంజనీరింగ్, లెదర్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, ఇంటీరియర్ డెకరేషన్ అండ్ డిజైన్, అగ్రికల్చర్
ఇంజనీరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ గార్మెంట్ టెక్నాలజీ,
ప్లాస్టిక్ అండ్ మౌల్డ్ టెక్నాలజీ, హోటల్
మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ సర్వీస్, ఎయిర్ క్రాఫ్ట్
మెయింటనెన్స్, డిప్లొమా ఇన్ హోమ్‌సైన్స్, డిప్లొమా ఇన్ ఫార్మసీ తదితర పాలిటెక్నిక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.